నకిలీ ప్లింత్ ఏరియా సర్టిఫికెట్ల కేసులో ఇద్దరి అరెస్ట్
సూర్య నస్పూర్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో నకిలీ ప్లింత్ ఏరియా సర్టిఫికెట్లు తయారు చేసి, అధికారుల సంతకాలు, కార్యాలయ ముద్రలను ఫోర్జరీ చేసిన ఇద్దరిని నస్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ కమిషనర్ గోనే అన్వేష్ ఫిర్యాదు మేరకు నస్పూర్ ఎస్సై ఎండీ తహసీనుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో మంచిర్యాలకు చెందిన గాదాసు శివకుమార్ అలియాస్ శివ (33), బెల్లంపల్లి మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మొహమ్మద్ ఇర్ఫాన్ (36) ప్రమేయం ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని మంచిర్యాల కోర్టులో హాజరుపరిచారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, చెక్కులు, ఉద్యోగ గుర్తింపు కార్డు, నకిలీ సర్టిఫికెట్ల కాపీలు, రెండు మున్సిపల్ స్టాంపులు, సర్టిఫికెట్ల డ్రాఫ్ట్ కాపీలు, కంప్యూటర్ డ్రైవ్, ప్రింటర్, రెండు కేబుళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.