BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

మంచిర్యాలలో తీవ్ర ఉద్రిక్తత.. వైద్యం అందలేదంటూ తల్లిని వీల్‌‌చైర్‌లో నేరుగా ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కుమారుడు

Select Suryaa Now
మంచిర్యాలలో తీవ్ర ఉద్రిక్తత.. వైద్యం అందలేదంటూ తల్లిని వీల్‌‌చైర్‌లో నేరుగా ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కుమారుడు

సూర్య తెలంగాణ డెస్క్: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. కిడ్నీ సంబంధిత సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధురాలైన తల్లికి సరైన వైద్యం అందకపోవడంతో ఆగ్రహం చెందిన కుమారుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. కనీసం బెడ్ కూడా కేటాయించకుండా సిబ్బంది వేధించారని ఆరోపిస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని అదే వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ స్థానిక ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లిన ఘటన జిల్లాలో కలకలం రేపింది.

మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన భూక్యా బుజ్జి (55) అనే మహిళ కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుమారుడు రాజ్ కుమార్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర చికిత్స నిమిత్తం తీసుకువచ్చాడు. అయితే ఆసుపత్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది ఎలాంటి చొరవ చూపకపోగా, బెడ్ ఇవ్వాలని కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. అంతేకాకుండా ఆసుపత్రి సిబ్బంది తనపై దురుసుగా వ్యవహరించి దాడికి కూడా పాల్పడ్డారని రాజ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

వైద్యులు, సిబ్బంది తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజ్ కుమార్ ఆస్పత్రిలోనే ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. అస్వస్థతతో బాధపడుతున్న కన్నతల్లిని వీల్‌చైర్‌పైనే కూర్చోబెట్టి రాత్రికి రాత్రే ఆసుపత్రి వెలుపలికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి వీల్‌చైర్‌ను నెట్టుకుంటూ సుమారు రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ నేరుగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు నివాసానికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతతో ఉన్న తల్లిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని వచ్చిన తల్లీకొడుకులను చూసి స్థానికులు విస్మయానికి గురయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంవో శ్రీధర్ హుటాహుటిన ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బంది వ్యవహారశైలిపై విచారణ జరుపుతామని, వృద్ధురాలికి మెరుగైన వైద్యం అందిస్తామని ఆర్‌ఎంవో హామీ ఇచ్చారు. అధికారుల జోక్యంతో శాంతించిన అనంతరం తల్లీకొడుకులను తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వాహనంలో తరలించి ప్రత్యేక వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు.