మేడ్చల్ డిపోలో టీజేఎంయూ విజయోత్సవ సంబరాలు
మేడ్చల్, మేజర్ న్యూస్ : మేడ్చల్ డిపోలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా శనివారం విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షుడిగా గౌరారం జగన్ గౌడ్, డిపో సెక్రటరీగా శ్రీనివాస్ విజయం సాధించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిపో వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. విజేతలను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. పలువురు బీజేపీ నాయకులు నూతనంగా ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్, చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్, బీజేవైఎం జిల్లా మాజీ కార్యదర్శి రాఘవ రెడ్డి, డివిజన్ బీజేపీ కార్యదర్శి బండి విష్ణు గౌడ్, బీజేపీ నాయకులు వంశీ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సుధాకర్ గౌడ్, రాజేష్, బాల్ రెడ్డి, గోపు నాగరాజ్, ఈశ్వర్, బాబు రాజ్, గౌలికర్ మహేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.