BREAKING
కేతగుడిపిలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 45 కుటుంబాలు!* బేతపూడి - రావి అనంతవరం బీటీ రహదారిని ప్రారంభించిన మంత్రులు దుద్దెడ శంభులింగేశ్వర క్షేత్ర కోనేరు పునర్నిర్మాణానికి సన్నాహాలు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్.చెక్కులు పంపిణీ ఖమ్మంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం నందివాడ మండలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవార్ల దర్శనం స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత గంధ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బి. ఎన్ సోషల్ మీడియా సమాచారపై జాగ్రత్తగా ఉండాలి:* ఎస్ఐ మహేష్ ఎల్‌నినో ప్రభావంపై.. రైతులకు అవగాహన కార్యక్రమం దశాబ్దాల నిరీక్షణకు తెర... 939 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు శ్రీ కంచి కామాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు యువత స్వయం కృషితో ఎదగాలి కొడంగల్‌లో ఆశా వర్కర్ల ధర్నా.. దోమ పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు సిపిఐ పామూరు మండల సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమం

లక్ష్మీపతి గూడెంలో మిషన్ భగీరథ నీటి వృథా

Select Suryaa Now
లక్ష్మీపతి గూడెంలో మిషన్ భగీరథ నీటి వృథా

జిన్నారం l:మిషన్ భగీరథ ట్యాంకు నుంచి ప్రతిరోజూ నీరు వృథాగా పోతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు లక్ష్మీపతి గూడెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తుండగా, మరోవైపు మిషన్ భగీరథ ట్యాంకు నుంచి నీరు వృథాగా పోతున్నా అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీటి సంరక్షణపై అవగాహన కల్పించాల్సిన అధికారులే వృథాను అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికే సకాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయని, దీనికి తోడు విద్యుత్ కోతలు, తాగునీటి వృథాతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. నీటి విలువను గుర్తించి వృథాను అరికట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, ట్యాంకు నుంచి నీరు వృథాగా పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మీపతి గూడెం గ్రామస్తులు కోరుతున్నారు.