BREAKING
అన్నదాన కార్యక్రమానికి కాట సుధా శ్రీనివాస్ గౌడ్'కు ఆహ్వానం బీజేవైఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి కొమ్మిడి విక్రాంత్ రెడ్డి *చింతల్‌గట్టులో సరస్వతీ దేవి దివ్యదర్శనం!* *శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విశేష అలంకరణ.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు* పేదల కళ్లలో సంతోషం చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డొంకెని శంకర్ గౌడ్ బండ మాదారం లో యథేచ్ఛగా అక్రమ మట్టి దందా…! మల్లాపూర్ సర్వే నెం. 84/1ను నిషేధిత జాబితా నుంచి తొలగించండి: తహసీల్దార్‌కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి ఘట్‌కేసర్‌లో వివాహిత అదృశ్యం మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నాసిరుల్లా అన్నారు. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం అందరి బాధ్యత -జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటపాటలతో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు -ముఖ్యఅతిథిగా పాల్గొన్న -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కన్నుల పండువగా బతుకమ్మ సంబురాలు: పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని చాటిన ఉద్యోగులు నిత్య అన్నదాన పథకానికి రూ 4 లక్షలు విరాళం శరన్నవరాత్రుల్లో సరస్వతీ దేవిగా అమ్మవార్ల దర్శనం.. యూనిక్ కంపెనీ పేరుతో పెట్టుబడుల మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్ చిత్రా మిశ్రా పూడివాడలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం- విద్యతోపాటు క్రీడలకూ సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి - గెలుపోటములను సమానంగా స్వీకరించాలి - పర్వతాపూర్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి

Select Suryaa Now
క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం- విద్యతోపాటు క్రీడలకూ సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి  - గెలుపోటములను సమానంగా స్వీకరించాలి  - పర్వతాపూర్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి

రామాయంపేట;క్రిడల్లో గెలుపోటములు సహజమని, విజయం సాధించిన వారు అహంకారానికి తావివ్వకుండా, ఓటమి ఎదురైన వారు నిరాశ చెందకుండా క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. విద్యతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు. రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో నిర్వహించిన పర్వతాపూర్ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) జెర్సీ ఆవిష్కరణ, క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆటల ద్వారా యువతలో క్రమశిక్షణ, పట్టుదల, సహనం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెప్పారు. క్రీడల్లో ఎదురయ్యే ఓటములను గెలుపునకు మెట్లుగా భావిస్తూ, తప్పులను సరిదిద్దుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు.యువత సరైన మార్గంలో పయనించినప్పుడే గ్రామం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ఆమె అన్నారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉంటూ సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.నాలుగు సీజన్లుగా పీపీఎల్ నిర్వహణ అభినందనీయం మారుమూల గ్రామమైన పర్వతాపూర్‌లో పర్వతాపూర్ ప్రీమియర్ లీగ్‌ను నాలుగు సీజన్లుగా విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి టోర్నీలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. టోర్నీ నిర్వాహకులు పోచయ్య, సిద్ధు, రంజిత్‌లను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడా పోటీల ద్వారా గ్రామ యువత ఒకే వేదికపైకి రావడం వల్ల స్నేహభావం, ఐకమత్యం బలపడతాయని ఆమె తెలిపారు. ఇలాంటి వేదికలపై గ్రామ సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ భాదే చంద్రం, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు ఉమామహేశ్వర్, పర్వతాపూర్ మాజీ సర్పంచ్ దయ లక్ష్మి స్వామి, కిషన్ తండా మాజీ సర్పంచ్ సుభాష్ రాథోడ్, బీఆర్ఎస్ నాయకులు బోయిని స్వామి, టోర్నీ టీమ్ ఓనర్లు, కెప్టెన్లు పోచయ్య, సిద్ధిరాములు, రంజిత్, శ్యామ్ కుమార్, లింబ్యా నాయక్, సంతోష్ కుమార్, చెన్నా, కాముని నవీన్, ఉప సర్పంచ్ కట్ట ఈశ్వర్, లక్ష్మి నర్సింలు, శ్రీనివాస్, డప్పు కిషన్, కట్ట లక్ష్మణ్, సిద్ధిరెడ్డి, డప్పు రాజు, డప్పు స్వామి, డప్పు విజయ్, చాకలి కుమార్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.