BREAKING
మోదీ సేవా స్ఫూర్తితో ‘సేవా సంకల్ప అభియాన్’ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో రాబోతున్న మయూఖ.. అక్టోబర్ 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ 40 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు రెడ్డి కుటుంబానికి ఘంటా సుధీర్‌ పరామర్శ ఐదేళ్లుగా పేరుకుపోయిన సహకార చక్కెర కర్మాగారాల కార్మికుల బకాయిలు విడుదల... కార్మికుల్లో ఆనందోత్సాహం ఒంగోలు ఉత్సవానికి సర్వం సిద్ధం ఐ సి డి ఎస్ సేవలపై అవగాహన కల్పించాలి ఘనంగా లోకబంధు విద్యాసంస్థల అధినేత తూముల పుట్టిన రోజు వేడుకలు: బాధిత కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం -ఎమ్మెల్యే సతీమణి కూన ప్రమీల థియేటర్ల నుంచి స్ట్రీమింగ్ వరకు.. హాలీవుడ్ సినిమా బిజినెస్ మోడల్ ఎలా మారింది? ఏలూరు జిల్లాలో సంచలనం - MRO పై PGRS లో మహిళ ఫిర్యాదు. ప్రజావాణికి ఆదరణ కరువు...! రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కొడంగల్ రోడ్డు మార్గంలో ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ, మూడు తులాల బంగారం అపహరణ

Select Suryaa Now
కొడంగల్ రోడ్డు మార్గంలో ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ, మూడు తులాల బంగారం అపహరణ

యాలాల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలో వరుస దొంగతనాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొడంగల్ రోడ్డు మార్గంలో తాజాగా మరో భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి నివాసాన్ని టార్గెట్ చేసిన దుండగులు రెచ్చిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చాకచక్యంగా గమనించిన దొంగలు, ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాను పగలగొట్టి అందులో భద్రపరిచిన సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలతో పాటు 70 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఉదయం సమయంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దొంగతనం జరిగిన తీరును బట్టి ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో వరుసగా నేరాలు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలోనే కాకుండా పగటిపూట కూడా గస్తీని ముమ్మరం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల పుటేజీలను సేకరించి వాటి ఆధారంగా దుండగుల కదలికలను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరిస్తూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.రిపోర్టర్ ప్రకాష్ గౌడ్.