telanagana
కండ్లకోయలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. భక్తులతో కిక్కిరిసిన మండపం
Telanagana
11 Oct 2026
52 views
By సూర్య ప్రతినిధి
Updated : 11 Oct 2026 19:53 IST
Select Suryaa Now
మేడ్చల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11): మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని కండ్లకోయ గ్రామంలో దుర్గామాత పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించగా, స్థానిక భక్తులతోపాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. గ్రామంలో శాంతి, ఐకమత్యం వెల్లివిరియాలని వేడుకున్నారు. మత, రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, స్థానికులు ఒకే వేదికపైకి వచ్చి పూజల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కండ్లకోయ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, గువ్వా రవి ముదిరాజ్, 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్, రాజేందర్ ముదిరాజ్, మల్లేష్, వెంకట్, ఎర్రోళ్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.