BREAKING
పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి:పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి,సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య

కేపీహెచ్‌బీలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు

Select Suryaa Now
కేపీహెచ్‌బీలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు

(కూకట్‌పల్లి, మేజర్ న్యూస్: భవన నిర్మాణాల మంజూరులో నియమ నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయనడానికి కూకట్‌పల్లిలో చోటుచేసుకుంటున్న ఉదంతాలే సజీవ సాక్ష్యాలు. పట్టణ ప్రణాళిక నిబంధనలను తొక్కేస్తూ.. అధికారులు, నిర్మాణదారుల కలయికతో అక్రమ కట్టడాలు అంతరిక్షాన్ని తాకుతున్నాయి. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీ 5వ ఫేజ్‌ పరిధిలోని ఓ నిర్మాణంలో వెలుగుచూసిన అంశాలు నగరంలో వ్యవస్థాగత నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ​బాధ్యతాయుతమైన మున్సిపల్ యంత్రాంగం కళ్లముందే నిబంధనల ఉల్లంఘన పర్వం పరాకాష్టకు చేరింది

. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌ (ప్లాట్‌ నంబర్‌ 165/హెచ్ఐజి, బ్లాక్‌-31, సర్కిల్‌-52, డివిజన్‌-252)లో ఒక భవనానికి కేవలం స్టిల్ట్ ప్లస్ రెండు (స్టీల్త్+2) అంతస్తులకే అనుమతి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.కానీ క్షేత్రస్థాయిలో ఏకంగా గ్రౌండ్ ప్లస్ ఏడు (గ్రౌండ్+౭) అంతస్తులు లేవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అనుమతించిన హెచ్ఐవి నిర్మాణానికి, నిర్మించిన అంతస్తులకు ఏమాత్రం పొంతన లేకపోవడం నగర ప్రణాళికా వ్యవస్థ తీరుపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది.​నగరాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలను నివారించేందుకు భవన ప్లాన్లలో స్టిల్ట్ ప్రాంతాన్ని వాహనాల నిలిపివేతకు కేటాయించడం తప్పనిసరి. కానీ ఇక్కడ, ​కేటాయించిన పార్కింగ్ స్థలాలను సైతం కమర్షియల్ లేదా నివాస గదులుగా మార్చేసి అదనపు సంపాదనకు మార్గంగా ఎంచుకున్నారు. భవనం బరువు (స్ట్రక్చరల్ లోడ్), సెల్లార్‌, ఎత్తు, సెట్‌బ్యాక్‌ల నిబంధనలను ఇక్కడ?​

అధికారుల పర్యవేక్షణేది? అవినీతి ఆరోపణలు!

​భవనం మొదటి అంతస్తు నిర్మాణం పూర్తికాకముందే క్షేత్రస్థాయి అధికారులు గుర్తించి నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, ఏడు అంతస్తులు లేచే వరకు పర్యవేక్షణ వ్యవస్థ నిద్రపోతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు అధికారులు లంచాల మత్తులో తూగుతూ, నిర్మాణదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇవి కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా మున్సిపల్ పరిపాలనా విభాగం ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణ చేపడితేనే అసలు సూత్రధారులు బయటపడతారు.

 ​అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే చట్టబద్ధంగా అనుమతులు పొంది ఇళ్లు నిర్మించుకునే సామాన్య పౌరులకు వ్యవస్థపై నమ్మకం సడలుతుంది. సర్కిల్‌-52 మున్సిపల్ అధికారులు తక్షణమే సదరు భవనాన్ని సందర్శించి, మంజూరైన ప్లాన్‌తో నిర్మాణ స్థితిని పోల్చి చూడాలి. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే షోకాజ్ నోటీసులు ఇవ్వడం, నిర్మాణాన్ని నిలిపివేయడం లేదా కూల్చివేత (డెమోలిటిన్) వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ​నగరంలో పెరుగుతున్న అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలంటే ఆరోపణలు రాగానే విచారణ చేపట్టి, బాధ్యులైన అధికారులతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.