కీసర సీఐ గా ఎలక్షన్ రెడ్డి
కీసర, మేజర్ న్యూస్:కీసర పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గా ఇన్స్పెక్టర్ ఎన్.ఎలక్షన్ రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఎస్ఓటీ కంటోన్మెంట్లో బాధ్యతలు నిర్వహించిన ఆయనను కీసర స్టేషన్ బాధ్యతలకు బదిలీ చేశారు.
శాంతిభద్రతల సమర్థ నిర్వహణతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం కమిషనరేట్ పరిధిలో చేపట్టిన బదిలీల్లో భాగంగా ఈ నియామకం జరిగింది.
రిపోర్టర్: కర్రె గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.