కేదారేశ్వర అయ్యప్ప స్వామి ఆలయానికి విరాళం
సూర్య,మాక్లూర్ :శ్రీ కేదారేశ్వర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ పనుల కోసం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి 630 సిమెంట్ బ్యాగులను విరాళంగా అందజేశారు. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన వినయ్ కుమార్ రెడ్డికి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు, డొంకేశ్వర్, నందిపేట్ మండలాలకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.