కప్పరావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సూర్య ఎండపల్లి / వెల్గటూర్ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కప్పరావుపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు, ఓ బైక్ పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో కిషన్రావుపేటకు చెందిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు ఓ కారు పూర్తిగా నుజ్జునుజ్జయినట్లు తెలుస్తోంది.
అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.