telanagana
కామారెడ్డి జిల్లాలో జాబ్ మేళా.... జిల్లా ఉపాధి కల్పనాధికారి
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 15న (గురువారం) రోజున ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.కలెక్టరేట్లోని మొదటి అంతస్తులో గల రూమ్ నెంబర్ 121, జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం, కామారెడ్డి నందు ఈ జాబ్ మేళా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ జాబ్ మేళాలో శ్వాసంట్రా మైక్రోఫైన్ లిమిటెడ్ కంపెనీ కామారెడ్డి సంస్థలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.ఖాళీల వివరాలు:చేరియాల్ బ్రాంచ్ – 10, రామాయంపేట బ్రాంచ్ – 10, మాచారెడ్డి బ్రాంచ్ – 5, పోస్టు: ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (లోన్ డిస్బర్స్మెంట్ & కలెక్షన్), విద్యార్హత: 10వ తరగతి నుండి ఏదైనా డిగ్రీ వరకు, వయస్సు: 18 నుండి 30 సంవత్సరాలు, జీతం: నెలకు రూ. 15,000/- ఇన్సెంటివ్స్, ఇతర సౌకర్యాలు: పెట్రోల్ అలవెన్స్, వసతి మరియు భోజన సదుపాయం, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు 2 సెట్ల బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు మరియు ఫోటోలతో హాజరు కావాలని సూచించారు.మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 8985612908, 6305743423 నంబర్లకు సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి తెలిపారు.