BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డును వెంటనే విడుదల చేయాలి

Select Suryaa Now
జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డును వెంటనే విడుదల చేయాలి

 

గాంధీ జయంతి రోజున పోస్ట్ కార్డు ఉద్యమాన్ని విజయవంతం చేయాలి

టీయూడబ్ల్యూజే 143దేవరకొండ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని ఆంజనేయులుయాదవ్


జర్నలిస్టుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరి వీడేలా ఒత్తిడి తెచ్చే క్రమంలో భాగంగా టియుడబ్ల్యూజే 143 రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు దశల వారి ఉద్యమం విజయవంతం చేయాలని  దేవరకొండ టియుడబ్ల్యూజే143 దేవరకొండ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని ఆంజనేయులుయాదవ్ తెలిపారు. అందులో భాగంగా అక్టోబర్ 2 జయంతి పురస్కరించుకొని దేవరకొండ తో పాటు అన్ని మండల కేంద్రాలలో గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టి పోస్టుకారులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు. వారం రోజుల పాటు 8 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ మిత్రులు అందరూ 50 పైసల పోస్ట్ కార్డ్ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కై వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా క్యాష్ లెస్ హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ హెచ్ ఎస్ కాకుండా ఈ జె హెచ్ ఎస్ స్కీమ్ ను పునరుద్ధరించి మెరుగైన సేవలు అందించాలని, దేవరకొండ నియోజకవర్గంలో అన్ని మండలాలకు సంబంధించిన జర్నలిస్టులు తమ పూర్తి వివరాలను పంపిస్తూ..మీ పేరు..పని చేసే సంస్థ పేరు.
జిల్లా పేరు
వివరాలు రాసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం( సీఎంఓ )
6వ అంతస్థు 
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం
హైదరాబాద్ - 500022 చిరునామాకు పోస్ట్ కార్డులను పంపాలని కోరారు. గాంధీ జయంతి రోజున చింతపల్లి మండల కేంద్రంలో గాంధీ విగ్రహం ఎదుట నిర్వహించే పోస్ట్ కార్డు ఉద్యమానికి చింతపల్లి మండల జర్నలిస్టులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.