BREAKING
విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి: 2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం... #.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు. #. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా బ్యూరో, ఎల్.కోటలో వైభవంగా దేవీ నవరాత్రులు, శ్రీ వెంకటేశ్వర దివ్యోత్సవాలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల దంపతులు గంగుబూడిలో నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు! కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అత్యంత వైభవోపేతంగా దేవి నవరాత్రులు దేశంలో ఓట్ల తొలగింపు అనేది అప్రజాస్వామికం-తెలంగాణ అమరేందర్ రెడ్డి మంచి మనసుంటే చాలు... అధికారమే ఉండాల్సిన అవసరం లేదు ఆదిలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం శరన్నవరాత్రి ప్రారంభ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను విజయ వంతం చేయండి. ముప్పవరం సాయిబాబా గుడిలో ఘనంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు. కడ్తాల్ మండలానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కుంగ్ ఫూ విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు. ఇంకొల్లులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం. పోలంపల్లి డ్యాం గండ్లు పూడ్చాలి.. రైతులకు సాగునీరు అందించాలి కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ సీపీ నేత తన్నీరు నాగేశ్వరరావు విమర్శలు

ఇర్విన్ డిఎల్ఐ భూనిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి

Select Suryaa Now
ఇర్విన్ డిఎల్ఐ భూనిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి

ఇర్విన్ డిఎల్ఐ భూనిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి

పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని  గ్రామసర్పంచ్ బావండ్లపల్లి కోటయ్య, మాజీ సర్పంచ్ రాజమోని పుష్పలతజంగయ్య యాదవ్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూధిని శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కసిరెడ్డికి భూనిర్వాసిత రైతుల వినతి

 

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పధకంలో భాగంగా ఇర్విన్ శివారులో పేద, మధ్యతరగతి వర్గాల రైతుల భూముల్లో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్ ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, ఒకవేళ సాధ్యం కాని పక్షంలో పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా రైతులకు భూ పరిహారం అందించేలా చూడాలని కోరుతూ ఆదివారం  గ్రామసర్పంచ్ బావండ్లపల్లి కోటయ్య, మాజీ సర్పంచ్ రాజమోని పుష్పలత జంగయ్య యాదవ్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూధిని శ్రీనివాస్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి  భూనిర్వాసిత రైతుల విన్నపించారు. ఈ సందర్భంగా తమకు ఉన్న ఎకరా, రెండెకరాల భూముల్లో రిజర్వాయర్ నిర్మిస్తే తమ కుటుంబాలు భూములు కోల్పోయి రోడ్డున పడతాయని, పెరిగిన భూముల ధరలను దృష్టిలో ఉంచుకొని రిజర్వాయర్ ముంపు భూములకు పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని వారు ఎమ్మెల్యే కు వివరించారు. ఈ సందర్భంగా రైతుల వినతిపై స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి భూ నిర్వాసిత రైతులందరికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు పల్లేటి రాములు, కడారి అల్లాజీ యాదవ్,  మాజీ వార్డు సభ్యులు తుప్పలయ్య గౌడ్, నాయకులు కొప్పుల వెంకటయ్య గౌడ్, గుండె వెంకటయ్యగౌడ్, జార్జిరెడ్డి, బెల్లంకొండ రవి, , భూనిర్వాసిత రైతులు, నాయకులు కడారి కొండల్ యాదవ్ , పాలకుర్ల యాదయ్య , మాదాసు వెంకటయ్య, మల్లయ్య, గూడురు శ్రీశైలం, మల్లేష్ ,పందుల యాదయ్య ,శంకర్, కంచుకట్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
-------
-ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ :మాడ్గుల