BREAKING
పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించిన కమిషనర్ ఆరోగ్యమే అసలైన సంపద... సొసైటీలో ఎరువులు అందుబాటులో పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రెయిన్వి బో ద్యార్థులు సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం

ఇచ్చిన హామీలు అమలు చేసి సిరిసిల్లకు రావాలి, లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం

Select Suryaa Now
ఇచ్చిన హామీలు అమలు చేసి సిరిసిల్లకు రావాలి, లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం


- సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూర్మాని రాజశేఖర్ రెడ్డి

సూర్య, తంగళ్లపల్లి:ఈ నెల 30న జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనను అడ్డుకుంటామని తంగళ్లపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూర్మాని రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చి సిరిసిల్ల గడ్డపై అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. గత 9 నెలలుగా గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు.
సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి 9 నెలలు కావస్తోందని, ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదన్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జనరల్ నిధులను అన్ ఫ్రీజ్ చేసి గ్రామ పంచాయతీలకు వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందని, అలాగే కోతలు పెట్టి వసూలు చేసే ఇంటి పన్నుల డబ్బులను డిపాజిట్ చేసి వెంటనే తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారని, కానీ ఆ హామీలు కూడా అమలు కాలేదని ఆరోపించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా సిరిసిల్లకు వస్తే సహించేది లేదని, సర్పంచులందరం కలిసి సీఎం పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు గుండు ప్రేమ్ కుమార్, సాయి కృష్ణ, బీఆర్ఎస్ నాయకుడు సిలివేరి చిరంజీవి పాల్గొన్నారు.