విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్
ఉపాధ్యాయులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ అన్నారు. మంగళవారం అయినా మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా నరసాపురంలో జరుగుతున్న రీ సర్వే ని పరిశీలించారు. సర్వేకు అధికారులందరూ సకాలంలో విచ్చేసి త్వరితగతిన పూర్తి చేయాలని, సర్వే అధికారులకు గ్రామంలోని రైతులు సహకరించాలని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం, తెలంగాణ గిరిజన బాలికల గురుకులాలని సందర్శించి వంటగది, స్టోర్ రూమ్, ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గురుకుల ప్రిన్సిపాల్ కు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ బి స్వర్ణ, ఎంఈఓ ఉండేటి ఆనంద్ కుమార్, గురుకులాల ప్రిన్సిపల్లు, రెవిన్యూ సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.