మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం
హాలియామేజర్ న్యూస్.
హాలియా మున్సిపాలిటీలోని అన్నపూర్ణ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు కూరగాయల మార్కెట్ ఏర్పాటు కోసం అనువైన స్థలం కేటాయించాలని కోరుతూ ఈ రోజు హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంధ్రారెడ్డి కి మున్సిపాలిటీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు,వ్యాపారుల సమస్యలను తెలుసుకుని, వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చైర్మన్ చింతల చంధ్రారెడ్డి తెలిపారు,
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్ గౌని రాజారమేష్ యాదవ్, 9వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి మాత్యాలుతో పాటు అన్నపూర్ణ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.