పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించిన కమిషనర్
పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించిన కమిషనర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం ద్వారా నగరవ్యాప్తంగా జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను మంగళవారం పర్యవేక్షించారు.
వార్డు సచివాలయ శానిటేషన్ సెక్రటరీలను జూమ్ మీటింగ్ ద్వారా అనుసంధానించి డివిజన్ల వారీగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులను వీడియోలలో పరిశీలించారు.
విధులకు హాజరైన పారిశుధ్య కార్మికుల హాజరు, డివిజన్ల వారీగా వారు చేస్తున్న విధుల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ వాహనాల పనితీరును కమిషనర్ పరిశీలించి కార్యదర్శులకు వివిధ సూచనలను అందించారు. అన్ని డివిజన్లలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ శానిటేషన్ కార్యదర్శులు విధులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగానికి ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు వెంటనే స్పందించి వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేరవేయాలని కమిషనర్ కంట్రోల్ సెంటర్ సిబ్బందికి సూచించారు. అనంతరం కంట్రోల్ సెంటర్ కు ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్ ను కమిషనర్ స్వయంగా రిసీవ్ చేసుకుని మాట్లాడారు. వారి సమస్యను అడిగి తెలుసుకుని వివరాలను నమోదు చేసుకున్నారు.