జర్నలిస్ట్ సంక్షేమ ం కోసం కృషి చేస్తాం
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
– ఎమ్మిగనూరులో ప్రెస్‌క్లబ్, జర్నలిస్టులకు నివేశన స్థలాల కేటాయింపునకు కృషి: ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు టౌన్ సూర్య
సమాజంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే డా. బి.వి. జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
మంగళవారం ఎమ్మిగనూరులోని కుర్ని ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఎమ్మిగనూరు తాలూకా ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, హెల్త్ కార్డులు వంటి సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ప్రెస్‌క్లబ్ నిర్మాణంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు నివేశన స్థలాల కేటాయింపునకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుని వృత్తిలో ముందుకు సాగాలని సూచించారు. నియోజకవర్గ జర్నలిస్టులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన తాలూకా అధ్యక్షుడు షబ్బీర్, నాయకులు గిప్సన్, దేవేంద్రమూర్తితో పాటు ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు సీనియర్, జూనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.