BREAKING
విశ్రాంతికి భరోసా కావాలి.. పెన్షనర్ల మహాధర్నా ఖాన్‌పురా ఉర్దూ పాఠశాలకు నాయకుల అండ పల్లె పండుగ 3.0 లో కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో 13 కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం సుడా చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను ప్రదానం చేసిన దక్షిణ మధ్య రైల్వే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదును ప్రారంభించిన బిఆర్ఎస్ మాజీ ఎంపీ నామ ఎంపీ పారమిత వరల్డ్ స్కూల్ లో విద్యార్థులకు ఆత్మరక్షణపై అవగాహన తాండూరులో జోరుగా బీసీల ఆత్మగౌరవ దీక్ష మున్సిపల్ చైర్మన్ రెసులో మోకా మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి వీడ్కోలు అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయండి : కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ముసుగు తొలగించాలని సర్పంచ్ కు వినతి.. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా 'ప్రపంచ హృదయ దినోత్సవ' 3కె వాక్ ఖమ్మం లో అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ జాతీయ మహాసభలు ప్రారంభం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు నవీన్ చంద్ర

Select Suryaa Now
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు నవీన్ చంద్ర

 

తిరుమల:

ప్రముఖ *సినీ నటుడు నవీన్ చంద్ర* మంగళవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు నవీన్ చంద్రకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.

అనంతరం ఆలయం వెలుపల నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ... *"తలపెట్టిన పనులు విఘ్నాలు లేకుండా నెరవేరాలని శ్రీవారిని ప్రార్థించాను. తిరుమల నుంచే నా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం. డైరెక్టర్ శ్రీకాంత్‌తో కలిసి మళ్లీ కాంబినేషన్‌లో చేస్తున్న ఈ రెండో చిత్రం ప్రేక్షకులకు ఒక పెద్ద సర్‌ప్రైజ్‌గా ఉండబోతోంది" అని పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో తనవి తమిళంలో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

 అలాగే ఇటీవల SVBC చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ వర్మను కలసి అభినందించినట్లు నవీన్ చంద్ర తెలిపారు. తమ కుటుంబానికి గత 15 ఏళ్లుగా శ్రీధర్ వర్మతో మంచి పరిచయం ఉందన్నారు. ఒక కళాకారుడిగా SVBC లో ఎటువంటి ప్రోగ్రామ్ చేయడానికైనా లేదా శ్రీవారి సేవలో భాగం కావడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో నటుడు నవీన్ చంద్రతో పాటు డైరెక్టర్ శ్రీకాంత్, ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ హరీష్ కుమార్ కూడా పాల్గొన్నారు.