గుప్పెడంత గుండె... ఆగితే అంతే!
నేడు ప్రపంచ హృదయ (గుండె) దినోత్సవం!
మన గుండెను కాపాడుకుందాం - ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకుందాం!
ఎస్.రాయవరం, మేజర్ న్యూస్:
మనం నిద్రపోతున్నా తన పని తాను చేసుకుపోయే ఏకైక నేస్తం మన హృదయం. దాన్ని పదిలంగా చూసుకోవడం మన బాధ్యత. ఏటా సెప్టెంబర్ 29న నిర్వహించే "ప్రపంచ హృదయ (గుండె) దినోత్సవం" సందర్భంగా వైద్యులు ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు.
*గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి...*
పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
ఉప్పు, చక్కెర, అధిక కొవ్వు పదార్థాలను తగ్గించాలి.
రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
పొగతాగడం, పొగాకు, మద్యానికి దూరంగా ఉండాలి.
ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి.
*గుండెపోటు హెచ్చరిక లక్షణాలు:*
ఛాతిలో నొప్పి.. బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లని చెమటలు, వికారం, చేయి.. భుజం... దవడకు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.