సంస్కృత వర్సిటీలో జన్ భాగీదారీ యాత్ర
కేంద్ర ప్రభుత్వం నెలరోజుల పాటు నిర్వహిస్తున్న 'స్వచ్ఛతా హి సేవ - 2026' కార్యక్రమంలో భాగంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం "జన్ భాగీదారీ యాత్ర" నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీలో జరిగిన కార్యక్రమానికి రిజిస్ట్రార్ కె.వెంకటనారాయణ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని స్వచ్ఛతా అవగాహన ర్యాలీని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ జీవితంలో ముఖ్య కర్తవ్యంగా భావించి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.తడి, పొడి, హానికారక, సర్జికల్ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నివారణ, నీటి వనరుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛతా హి సేవ నోడల్ ఆఫీసర్, ఏపీఆర్వో డా. కనపాల కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రాక్టర్ ప్రొ.సతీష్ కె.ఎస్, డీన్ ప్రొ.ఎస్. దక్షిణామూర్తి శర్మ, సీడీవోఈ డైరెక్టర్ ప్రొ. సి. రంగనాథన్, పీఆర్వో ప్రొ.వి.రమేష్ బాబు, పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.రమాకాంత మిశ్ర 500 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.