గుండెను కాపాడుకుందాం..ఆరోగ్యంగా జీవిద్దాం -ప్రపంచ హృదయ దినోత్సవంలో SVIMS డైరెక్టర్ డా.జగదేశ్ పిలుపు
"మన గుండె ఆరోగ్యమే మన కుటుంబ ఆరోగ్యానికి పునాది" అని SVIMS సంచాలకులు డా.గుడారు జగదేశ్ పిలుపునిచ్చారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మంగళవారం SVIMS OPD బ్లాక్‌లో కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.జగదేశ్ మాట్లాడుతూ, SVIMSలో అంతర్జాతీయ ప్రమాణాలతో ECG, Echo, TMT, Angiography, Angioplasty, Stent, Pacemaker, ICD, CRT-D వంటి అత్యాధునిక గుండె వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. ఆధునిక Cath Lab, మానిటరింగ్ వ్యవస్థలతో సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని, అత్యాధునిక వైద్యం పేదలకు కూడా అందాలన్నదే లక్ష్యమన్నారు. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, పొగతాగడం, మధుమేహం, BP, కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణమని, ఆరోగ్యకరమైన ఆహారం, నిత్య వ్యాయామం, ఒత్తిడి నియంత్రణే తొలి ఔషధమని సూచించారు. ఛాతీ నొప్పి, శ్వాస ఇబ్బంది, చెమటలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.కార్డియాలజీ విభాగాధిపతి డా.వనజాక్షమ్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. పి.వరుణ్ గుండె ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఇటీవల CSI-AP Chapter పోటీల్లో విజేతలైన డా. పి.వరుణ్, డా.సురేష్ కుమార్, డా.విష్ణు ప్రసన్న బాబు, డా.బ్రహ్మజాన రెడ్డి, డా. విష్ణువర్ధన్ రెడ్డిలను, రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్నికైన డా.వనజాక్షమ్మను డా. జగదేశ్ అభినందించారు.
సిఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి