BREAKING
విశ్రాంతికి భరోసా కావాలి.. పెన్షనర్ల మహాధర్నా ఖాన్‌పురా ఉర్దూ పాఠశాలకు నాయకుల అండ పల్లె పండుగ 3.0 లో కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో 13 కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం సుడా చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను ప్రదానం చేసిన దక్షిణ మధ్య రైల్వే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదును ప్రారంభించిన బిఆర్ఎస్ మాజీ ఎంపీ నామ ఎంపీ పారమిత వరల్డ్ స్కూల్ లో విద్యార్థులకు ఆత్మరక్షణపై అవగాహన తాండూరులో జోరుగా బీసీల ఆత్మగౌరవ దీక్ష మున్సిపల్ చైర్మన్ రెసులో మోకా మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి వీడ్కోలు అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయండి : కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ముసుగు తొలగించాలని సర్పంచ్ కు వినతి.. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా 'ప్రపంచ హృదయ దినోత్సవ' 3కె వాక్ ఖమ్మం లో అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ జాతీయ మహాసభలు ప్రారంభం

1 లక్ష సర్వీసులను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం చారిత్రాత్మక మైలురాయి: శివశంకర్‌ లోతేటి

Select Suryaa Now
1 లక్ష సర్వీసులను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం చారిత్రాత్మక మైలురాయి: శివశంకర్‌ లోతేటి

 

ఒక లక్ష.. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. స్వచ్ఛమైన ఇంధనం, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ దిశగా కేవలం 6 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సాధించిన ఒక ముఖ్యమైన అడుగు. సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా  యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ (యుఎల్ఎ) విధానంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర విద్యుత్తును అందుబాటులోకి తీసుకువచ్చే పనులను ఎపిఎస్పిడిసిఎల్ వేగవంతం చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, వాటిని గ్రిడ్ కు అనుసంధానం చేసే క్రమంలో ఎపిఎస్పిడిసిఎల్ ఒక లక్ష సర్వీసుల మైలు రాయిని చేరుకుంది. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో అమలు చేస్తున్న రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పనుల్లో ఒక లక్షకు పైగా సర్వీసులను గ్రిడ్ కు అనుసంధానం చేసిన తొలి విద్యుత్ పంపిణీ సంస్థగా ఎపిఎస్పిడిసిఎల్ నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఇంధనశాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ ల దిశా నిర్దేశంతో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు అంశంలో రాష్ట్ర స్థాయిలో ఏపీఎస్పీడీసీఎల్ ఒక లక్ష సోలార్ వ్యవస్థలను ఏర్పాటుచేసిన మొదటి డిస్కమ్ గా నిలవడంతోపాటు యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ (యుఎల్ఎ) విధానంలో రికార్డు స్థాయిలో ఒక లక్ష సోలార్ వ్యవస్థలను ఏర్పాటుచేసి ఏపీఎస్పీడీసీఎల్ జాతీయస్థాయిలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో‌ అగ్రగామిగా నిలవడం, అదేవిధంగా సోలార్ వ్యవస్థల ఏర్పాటులో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఒక కోటి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 415 మెగావాట్ల సామర్థ్యంతో 2.07 లక్షల ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయడంపై ఎపిఎస్పిడిసిఎల్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పనుల్లో భాగంగా ప్రస్తుతం నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఇ) పోర్టల్ యుటిలిటీ లెడ్ ఆగ్రిగేషన్ (యుఎల్ఎ) అధికారిక గణాంకాల మేరకు 210 మెగావాట్ల సామర్థ్యంతో ఒక లక్ష గృహాలపై సోలార్ వ్యవస్థలను ఎపిఎస్పిడిసిఎల్ ఏర్పాటు చేసింది. మిగిలిన గృహాలకు కూడా సోలార్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల నుంచి అంగీకార పత్రాల స్వీకరణ నుంచి సౌర వ్యవస్థ ఏర్పాటు, తనిఖీ, గ్రిడ్ కు అనుంసంధానం చేసే వరకు ప్రక్రియను వేగవంతం చేయడం జరుగుతోంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు తమ గృహాలపై సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్ కు పంపించడం ద్వారా సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అవకాశం ఏర్పడుతోంది.