BREAKING
*కన్నాయిగూడెం జడ్పీ హైస్కూల్‌ కమిటీ చైర్మన్‌గా కందుల గోపాల్‌* . గుండెను కాపాడుకుందాం..ఆరోగ్యంగా జీవిద్దాం -ప్రపంచ హృదయ దినోత్సవంలో SVIMS డైరెక్టర్ డా.జగదేశ్ పిలుపు జర్నలిస్ట్ సంక్షేమ ం కోసం కృషి చేస్తాం లిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో... 3k రన్ సక్సెస్ 1 లక్ష సర్వీసులను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం చారిత్రాత్మక మైలురాయి: శివశంకర్‌ లోతేటి గుప్పెడంత గుండె... ఆగితే అంతే! రాముడు, శివుడు అందరి ఆరాధ్య దైవాలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు నవీన్ చంద్ర హార్టికల్చర్ హబ్ " పై జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వం ఆగ్రహం లీగల్ సెల్ సెక్రెటరీగా జానకి రామ్ సంస్కృత వర్సిటీలో జన్ భాగీదారీ యాత్ర మోడల్ ప్రైమరీ స్కూల్ రాయమాల్పురం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం* విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఆరోగ్యమే అసలైన సంపద...

Select Suryaa Now
ఆరోగ్యమే అసలైన సంపద...


– గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకే 3కె వాకథాన్‌
– కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం

సూర్య కరీంనగర్:ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం గుండెపై పడే అవకాశముందని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా గుండెను పదిలంగా ఉంచుకోవడంతోపాటు సంతోషంగా, ఎక్కువ కాలం జీవించవచ్చని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు. వరల్డ్‌ హార్ట్‌డేను పురస్కరించుకొని కరీంనగర్‌ మెడికవర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం 3కె వాకథాన్‌ నిర్వహించారు. మెడికవర్‌ ఆసుపత్రి నుంచి కోర్టు చౌరస్తా, తెలంగాణచౌక్‌ మీదుగా తిరిగి ఆసుపత్రి వరకు సాగిన వాకథాన్‌ను సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగుంటేనే కుటుంబంతో, సమాజంతో సంతోషంగా గడపగలమన్నారు. నిత్యం వ్యాయామం చేయడం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, సరిపడా నిద్రపోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం వంటి అలవాట్లు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు. గుండె ఆరోగ్యం కేవలం వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన అంశం కాదని, చిన్న వయస్సు నుంచే దానిపై శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. మెడికవర్‌ వైద్యులు మాట్లాడుతూ.. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడంతో గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం అవసరమని పేర్కొన్నారు. గుండె జ‌బ్బు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే ఆసుప‌త్రి వ‌స్తే 24 గంట‌ల్లోనే స్టంట్ వేసి పంపించే టెక్నాల‌జీ క‌రీంన‌గ‌ర్‌లో అందుబాటులోకి వ‌చ్చిందన్నారు. గ‌తంలో పోలిస్తే గుండెపోటు మ‌ర‌ణాలు కూడా త‌గ్గిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. మెడికవర్‌ సెంటర్‌ హెడ్‌ గుర్రం కిరణ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వాకథాన్‌లో కార్డియాలజిస్టులు డాక్టర్‌ అనీష్‌ పబ్బ, డాక్టర్‌ వాసుదేవరెడ్డి, డాక్టర్‌ సతీష్‌కుమార్, సి.టి. సర్జన్ డాక్టర్ రవి కుమార్, అనెస్తీషియా వైద్యులు డాక్టర్‌ వినయ్‌కుమార్, డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్లు డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ లోకేష్, ఆర్థోపెడిక్‌ సర్జన్ డాక్టర్‌ రాకేష్, న్యూరోసర్జన్‌ డాక్టర్‌ రాజీవ్‌రెడ్డి, క్రిటికల్‌కేర్‌ నిపుణులు డాక్టర్‌ ఉపేందర్‌రెడ్డి, అభిషేక్‌, యూరాల‌జిస్టు డాక్ట‌ర్ ర‌విశంక‌ర్‌, ఈఎన్‌టీ డాక్ట‌ర్ శ్రీ‌ప‌తినాయుడు, సూపరింటెండెంట్‌ ప్రియాంక, సీఎస్‌వో గౌస్‌బాబా, మార్కెటింగ్‌ మేనేజర్‌ కోట కర్ణాకర్, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఈశ్వర్, ఆపరేషన్స్‌ మేనేజర్‌ సాయిచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
=====