BREAKING
మోడల్ ప్రైమరీ స్కూల్ రాయమాల్పురం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం* విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మల్లేశ్వరంలో స్కూల్ కమిటీ ఎన్నిక నంద్యాలలో 36వ రాష్ట్రస్థాయి అనస్థీషియా వైద్యుల సదస్సు రెండు గ్రామాల మధ్య రోడ్డు వేయడం లేదని బురదలో కేకు కోసి నిరసన బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగత ఏర్పాట్లు పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించిన కమిషనర్ ఆరోగ్యమే అసలైన సంపద... సొసైటీలో ఎరువులు అందుబాటులో పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రెయిన్వి బో ద్యార్థులు సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం

గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం

Select Suryaa Now
గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం

అనంతపురం బ్యూరో 

గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం

హృదయ ఆరోగ్యంపై*అవగాహనకు *కిమ్స్‌ సవీర 2కె రన్‌

అనంతపురం, 29 సెప్టెంబర్ 2026: 

 

గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు కిమ్స్‌ సవీర హాస్పిటల్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2కె రన్‌ నిర్వహించారు. టవర్ క్లాక్ సర్కిల్ టు సప్తగిరి సర్కిల్ తిరిగి టవర్ క్లాక్ సర్కిల్ వరకు సాగిన ఈ రన్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది, యువత, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కిమ్స్‌ సవీర హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మూడే సందీప్‌ మాట్లాడుతూ.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం అవసరమన్నారు. నేటి జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, పొగతాగడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని సూచించారు.

కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పర్వేజ్ నవాజ్ మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఒక్కరోజుకే పరిమితం కాకూడదు. ప్రతి రోజూ మన జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. 

ఐఎంఏ అనంతపురం వైస్ ప్రెసిడెంట్ డా. రావి శ్రీనివాసులు మాట్లాడుతూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక చెమటలు, అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి” అని సూచించారు. గుండె జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డా. పవన్ మాట్లాడుతూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వ్యాయామం మన రోజువారీ జీవితంలో భాగం కావాలి. 2కె రన్‌ వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు శారీరక చురుకుదనంపై ఆసక్తిని కలిగిస్తాయి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

గుండెపోటు లక్షణాలను ముందుగా గుర్తించి సకాలంలో చికిత్స పొందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది” కార్డియాలజీ విభాగం వైద్యులు అన్నారు.  

ఈ సందర్భంగా “గుండె కోసం పరుగు.. ఆరోగ్యం కోసం అడుగు” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కిమ్స్‌ సవీర హాస్పిటల్‌ వైద్యులు, డా. రాజేష్, ఆపరేషన్స్ డీజీఎం డా. ధీరజ్, మార్కెటింగ్ జీఎం ప్రభాకర్, నర్సింగ్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.