BREAKING
పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించిన కమిషనర్ ఆరోగ్యమే అసలైన సంపద... సొసైటీలో ఎరువులు అందుబాటులో పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రెయిన్వి బో ద్యార్థులు సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం

అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి

కాంగ్రెస్ నాయకుడు బొక్క సత్తిరెడ్డి పిలుపు
ఘటకేసర్,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 29): ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి హక్కు అయిన ఓటు విలువను గుర్తించి, అర్హులైన పట్టభద్రులంతా విధిగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు బొక్క సత్తిరెడ్డి కోరారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చదువుకున్న యువత మరియు పట్టభద్రులు రాజకీయ అవగాహనతో ముందుకు వచ్చి తమ బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సత్తిరెడ్డి వెల్లడించారు. డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండి ఇప్పటివరకు ఓటరుగా పేరు నమోదు చేసుకోని వారు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలపై చట్టసభల్లో గళం వినిపించే సమర్థులైన ప్రతినిధులను ఎన్నుకోవడంలో పట్టభద్రుల పాత్ర ఎంతో కీలకమని, అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 28, 2026 నుంచి ప్రారంభమైన ఈ ఓటరు నమోదు మరియు మార్పుల ప్రక్రియ నవంబర్ 6, 2026 వరకు కొనసాగుతుందని ఆయన వివరించారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు నిర్దేశిత గడువులోగా సంబంధిత దరఖాస్తులను పూర్తి చేసి ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా చదువుకున్న యువత అందరూ ఈ ప్రజాస్వామ్య బృహత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని బొక్క సత్తిరెడ్డి పిలుపునిచ్చారు. రిపోర్టర్ గుర్రం రమేష్.