హైమాస్ట్ లైట్లు ప్రారంభం
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని కొల్లూరు గ్రామపంచాయతీ పరిధిలోని సత్రోనిపల్లి తాండలో బంగారు మైసమ్మ బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సర్పంచ్ సేవ్యా నాయక్ హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.తాండలో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్,మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చందర్ నాయక్,రాజు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.