telanagana
గుంట్లపేట్లో భూ రీ-సర్వే పరిశీలించిన సబ్ కలెక్టర్
సూర్య,పెంచికల్పేట్: పెంచికల్పేట్ మండలంలో కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి మంగళవారం పర్యటించి రెవెన్యూ శాఖకు సంబంధించిన పనులను పరిశీలించారు. తొలుత గుంట్లపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న కాడాస్ట్రల్ రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే పురోగతి, సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పెంచికల్పేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఎల్కపల్లి గ్రామ పరిధిలోని ఇసుక రీచ్ను సందర్శించి తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బోడ రవీందర్, డీటీ చిన్ను,ఆర్ఐ రాజేష్, సర్వేయర్ ధనరాజ్, జీపీఓలు షారుఖ్,అనిల్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.