BREAKING
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జర్నలిస్టులపై అణచివేత...భారత ప్రభుత్వ తీరుపై మీడియా సంస్థల తీవ్ర ఆరోపణలు సన్నీ డియోల్ ‘సూర్యా’ ఫస్ట్ లుక్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న రగ్డ్ లుక్! బుచ్చిలో వైసీపీ మైనారిటీలకు పెద్దపీట.. చైర్ పర్సన్ గా షేక్ షకీలా బేగం.. కాంగ్రెస్ మాటల చేతలకు పొంతన లేదు :0పెరమోని నరేష్ యాదవ్ 25 మంది వృద్ధులకు అన్నదానం రబిలో ఆరుతడి పంటలే మేలు! గ్రైండర్ డేటా షేరింగ్ వివాదం...మైక్రోసాఫ్ట్ 'జాండర్' సంస్థకు నార్వే భారీ జరిమానా ఈవోని కలిసిన దేవస్థాన కమిటీ సభ్యుడు బీజేవైఎం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులుగా మణి మోదీ వెంకటేశ్వర దేవాలయం కు ఎమ్మెల్యే శంఖు స్థాపన అన్నపూర్ణా దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు పొదలకూరు దశ, దిశ మారుస్తోన్న సోమిరెడ్డి ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న ప్రోత్సాహకాలే అసలు సమస్య కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ బాధ్యతల స్వీకరణ.

ఘనంగా సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయ ప్రారంభం

Select Suryaa Now
ఘనంగా సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయ ప్రారంభం

ఘనంగా సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయ ప్రారంభం

​ సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. పద్మశాలీల ఐక్యత, ఆత్మగౌరవ సాధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశాలీల సమగ్ర అభివృద్ధి, సంక్షేమం ఐక్యతతోనే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి పద్మశాలీ కుటుంబాన్ని సంఘటితం చేసేందుకు కేవలం రూ. 10 నామమాత్రపు రుసుముతో సభ్యత్వ నమోదు చేపట్టి, దాదాపు 50 నుంచి 60 వేల మందిని సంఘంలో చేర్పించి పటిష్టమైన శక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. సిరిసిల్ల గడ్డపై పద్మశాలీల సంఖ్యాబలం అధికంగా ఉన్నందున, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పద్మశాలి బిడ్డనే అసెంబ్లీకి పంపే విధంగా వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా 'పద్మ పీఠం' ఎడిటర్ కొక్కుల భాస్కర్, మార్కండేయ జయంతి ఉత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్, దుబ్బాక పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గాలయ్య, మాజీ కౌన్సిలర్లు గూడూరి భాస్కర్, పత్తిపాక పద్మ శంకర్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తూ సమాజ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.​అనంతరం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మాదాస్ శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా గుంటుక పురుషోత్తం, సహాయ కార్యదర్శిగా జిందం రవీందర్, కోశాధికారిగా దాసరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా గాజుల సదానందం, దూడం సురేష్, తాటిపాముల సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు గొనె ఎల్లప్ప, నాయకులు అరుకాల రమేష్, దేవనపల్లి రామకృష్ణలతో పాటు పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. పద్మశాలీల ఐక్యత, ఆత్మగౌరవ సాధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశాలీల సమగ్ర అభివృద్ధి, సంక్షేమం ఐక్యతతోనే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి పద్మశాలీ కుటుంబాన్ని సంఘటితం చేసేందుకు కేవలం రూ. 10 నామమాత్రపు రుసుముతో సభ్యత్వ నమోదు చేపట్టి, దాదాపు 50 నుంచి 60 వేల మందిని సంఘంలో చేర్పించి పటిష్టమైన శక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. సిరిసిల్ల గడ్డపై పద్మశాలీల సంఖ్యాబలం అధికంగా ఉన్నందున, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పద్మశాలి బిడ్డనే అసెంబ్లీకి పంపే విధంగా వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా 'పద్మ పీఠం' ఎడిటర్ కొక్కుల భాస్కర్, మార్కండేయ జయంతి ఉత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్, దుబ్బాక పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గాలయ్య, మాజీ కౌన్సిలర్లు గూడూరి భాస్కర్, పత్తిపాక పద్మ శంకర్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తూ సమాజ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

​అనంతరం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మాదాస్ శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా గుంటుక పురుషోత్తం, సహాయ కార్యదర్శిగా జిందం రవీందర్, కోశాధికారిగా దాసరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా గాజుల సదానందం, దూడం సురేష్, తాటిపాముల సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు గొనె ఎల్లప్ప, నాయకులు అరుకాల రమేష్, దేవనపల్లి రామకృష్ణలతో పాటు పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.