BREAKING
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి.. మాజీ ఎంపీ బెల్లాన్ని చంద్రశేఖర్ పలువురిని పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అండగా ఉంటామని భరోసా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో నిరసన. యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం

ఘనంగా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడమ్ లింగమూర్తి 63వ జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడమ్ లింగమూర్తి 63వ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడమ్ లింగమూర్తి 63వ జన్మదిన వేడుకలు

అక్కన్నపేట చౌరస్తాలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం భారీగా తరలివచ్చిన అభిమానులు ప్రజలు

హుస్నాబాద్ :పేదల పక్షపాతిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందిన మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి 63వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కన్నపేట చౌరస్తాలో అభిమానులు, ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేడం లింగమూర్తి అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ, పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ పలువురు ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రజల మధ్య ఆత్మీయతను పెంపొందించేలా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అభిమానులు, ప్రజలు కేడం లింగమూర్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అక్కన్నపేట చౌరస్తాలో జరిగిన ఈ వేడుకలు అభిమానుల సందడి మధ్య ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్పర్సన్ దండి లక్ష్మి వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ కౌన్సిలర్లు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిత్తారి రవీందర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెన్నరాజు  కో ఆప్షన్ నెంబర్ ఎండి హసన్ కాంగ్రెస్ సర్పంచులు జవహర్ నాయక్ సంపత్ కాంగ్రెస్ నాయకుడు ఇజ్జగిరి అనిల్ మరియు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు