ఎస్.బి.ఐ అసిస్టెంట్ మేనేజర్ గా జఠావత్ చందునాయక్
సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మాడ్గుల మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు లాలునాయక్….
మాడ్గుల మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా మండల పరిధిలోని పల్గుతాండ గ్రామపంచాయతి పడమటి తాండకు చెందిన జఠావత్ చందునాయక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు నూతన సహాయ కార్యనిర్వాణాధికారిగా బాధ్యలు చేపట్టిన చందునాయక్ ను అదే తాండకు చెందిన మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు జఠావత్ లాలునాయక్ స్థానికులతో కలిసి అసిస్టెంట్ మేనేజర్ తో పాటు మేనేజర్ లను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాలు నాయక్ తన సోదరుడి కుమారుడైన చందునాయక్ చిన్నతనం నుండే కష్టపడి, పట్టుదలతో చదివి ఎస్.బి.ఐ అసిస్టెంట్ మేనేజర్ గా హైద్రాబాద్ తో పాటు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్.బి.ఐ లో సేవలందించారని తెలిపారు. సహాయ మేనేజర్ గా చందునాయక్ మండల ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందించి స్థానికుల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు.
----------
-ఆర్. నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల