BREAKING
*శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్‌ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల విజ్ ఎయిర్ దూకుడు ప్రతి వార్డులో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి

ఎస్ఐగా పదోన్నతి - బాధ్యతలు చేపట్టనున్న లింగంపేట్ వాసి

Select Suryaa Now
ఎస్ఐగా పదోన్నతి - బాధ్యతలు చేపట్టనున్న లింగంపేట్ వాసి
సూర్య,లింగంపేట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన బోక్రే రఘు ఎస్ఐగా పదోన్నతి పొంది, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా ఎస్ఐ నియామక పత్రం అందుకున్నారు.1989 బ్యాచ్ పీసి 137 కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో అడుగుపెట్టిన రఘు పోలీస్ శాఖలో పలువురు అధికారుల మన్ననలు పొంది అంచెలంచెలుగ ఎదిగి ఎస్ఐ గా ప్రమోషన్ పొందారు.తొలి పోలీస్ కానిస్టేబుల్ గా  దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు ప్రారంభంబించి బదిలీ పై బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించారు.2011లో హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొంది కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఫ్రెండ్లి పోలీస్ గా సేవలందించి అధికారులతో శభాష్ పోలీస్ అనిపించుకున్నారు.సిఐడి ఆఫీసర్ గా హైదరాబాద్ లో పని చేసి 2018 లో ఏఎస్ఐగా ప్రమోషన్ పొంది స్పెషల్ బ్రాంచ్ లో ఎల్లారెడ్డి,గోపాల్ పేట్,లింగంపేట,తాడ్వాయి పోలీస్ స్టేషన్లలో సేవలు అందింస్తుండగానే 2026 లో ఎస్ఐగా ప్రమోషన్ రావడం జరిగింది.సిద్దిపేట జిల్లాలోని సీపీ రష్మీ పెరుమళ్ చేతుల మీదుగా పుష్ప గుచ్చం అందుకొన్నారు.త్వరలోనే రఘు సిద్దిపేట జిల్లాలో ఎస్ఐ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం.పోలీస్ డిపార్ట్మెంట్ లో దాదాపు 37 ఏళ్ల పాటు సుదీర్ఘ సర్వీసులో నిబద్ధతతో పనిచేసిన రఘుకు ఎస్ఐగా ప్రమోషన్ రావడం పట్ల తోటి సిబ్బంది,మిత్రులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.