telanagana
ఎమ్మెల్యే చిత్ర పటానికి పాల భిషేకం
సూర్య,లింగంపేట్: లింగంపేట్ మండలం లింగంపల్లి ఖుర్దు గ్రామంలో శనివారం ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్,రాష్ట్ర ప్రభుత్వ చిత్రపటాలకు సర్పంచ్ గొల్ల ప్రత్యుష సాయిరాం ఆధ్వర్యంలో గ్రామస్థులు పాలభిషేకం చేసారు.ఈ సందర్బంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ చిరకాల కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేసారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక చొరవతో గ్రామానికి 3 కోట్ల 37 లక్షల 81 వేల వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.సబ్ స్టేషన్ మంజూరు కావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలందరూ డప్పు సప్పులతో టపాసులు కాల్చుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.ఎమ్మెల్యే కు ప్రజలందరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గొల్ల కాశీరాం యాదవ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోకుల్ సాయిరాం యాదవ్,గ్రామ పెద్దలు,ప్రజలు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.