దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి - జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్
సూర్య- బిక్కనూర్ : దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి చెప్పారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతను మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు ప్రతి ఒక్కరిపై ఉంటుందని, అన్నపూర్ణాదేవి ఆశీస్సుల వల్ల ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు