చింతపల్లి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మాసం
పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
తొలి 1000 రోజుల ప్రాధాన్యంపై అవగాహన
గర్భిణీలు,బాలింతలకు పోషకాహారంపై సూచనలు
రక్తహీనత నివారణపై అవగాహన
చింతపల్లి మేజర్ న్యూస్ . నల్లగొండ జిల్లా: చింతపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం సాయి సుమంగళి గార్డెన్లో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ
కార్యక్రమంలో సీడీపీవో. సక్కుబాయి మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తొలి 1000 రోజుల ప్రాముఖ్యత ఎంతో ఉందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు.
పోషకాహార లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించి, పోషకాహార ప్రాధాన్యాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు. అంజమ్మ, సుగుణ, యశోద, విజయలక్ష్మి, వసంత, ప్రసన్నలక్ష్మి, వైష్ణవి, డీసీ సతీష్, బీసీ శ్రీను, అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.