BREAKING
గుంతల రోడ్లతో గోస.. పట్టించుకునే దిక్కేది? రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం పిల్లల భవిష్యత్తు క్రీడల్లోనే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి. పిసిసి డెలికేట్ ఏలూరు శ్రీనివాస్ రెడ్డి ​స్వచ్ఛ నగరమే లక్ష్యంగా.. చీపురుపట్టిన ఎమ్మెల్యే లోకం మాధవి లక్షెట్టిపేట సబ్‌జైల్‌లో వైద్య శిబిరం మలక్‌పేటలో ప్రమాదం.. వివాహిత మృతి గెలుపే లక్ష్యంగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఆయుర్వేదానికి దీవి గోపాలాచార్యులు సేవలు చిరస్మరణీయం సాధ్విక ఎంబీబీఎస్ చదువుకు ఫీజు చెల్లించి మానవత్వం చాటుకున్న వేముల* ధమ్మ క్రాంతి ర్యాలీలో సమతా సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి అక్రమ అరెస్టులను ఆపాలి.. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి ​తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఆర్. హనుమంత్ నాయక్

చెరువు తూము వద్ద కట్ట తొలగించాలి!

Select Suryaa Now
చెరువు తూము వద్ద కట్ట తొలగించాలి!
సూర్య, చింతలమానేపల్లి : వైగాం గ్రామానికి చెందిన చెరువు తూము వద్ద ఏర్పాటు చేసిన పెద్ద కట్టను తొలగించి, తమ పంట పొలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రణవెళ్లి గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రైతులు వైగాం చెరువు వద్దకు వెళ్లి తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.ప్రతి సంవత్సరం వైగాం చెరువు నుంచి వచ్చే నీరు వాగు ద్వారా తమ పంట పొలాలకు చేరుతుందని రైతులు తెలిపారు. ఈ చెరువులో సుమారు వెయ్యి ఎకరాలకు సరిపడా నీరు ఉన్నప్పటికీ, తూము వద్ద పెద్ద కట్ట నిర్మించడంతో రణవెళ్లి, టేకంగూడ గ్రామాలకు నీరు చేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో రణవెళ్లి, టేకంగూడ, బూరెపల్లి గ్రామాలకు చెందిన రైతులు సాగునీటి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు అందకపోతే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, తూము వద్ద ఏర్పాటు చేసిన కట్టను పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మూడు గ్రామాల రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.