చైతన్యంలో.. బతుకమ్మ కోలాహలం
చౌటుప్పల్, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు చౌటుప్పల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థినులు, ఉపాధ్యాయినులు, తల్లిదండ్రులు ఆటపాటలతో సందడి చేశారు.ఈ వేడుకలకు శ్రీ చైతన్య పాఠశాలల దిల్‌సుఖ్‌నగర్ జోన్ ఏజీఎం ఎం. వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. భావితరాలకు మన సంస్కృతిని అందించడంలో పాఠశాలలు, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.
బతుకమ్మల అలంకరణలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ముఖ్య అతిథి అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత బాన్స్, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.