BJYM జిల్లా ప్రధాన కార్యదర్శిగా పద్మ అనిల్ ముదిరాజ్ ఎన్నిక
తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన, మాజీ ఉపసర్పంచ్, పద్మ అనిల్ ముదిరాజ్ ని బీజేవైఎం నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ గురువారం జిల్లా బిజెపి నాయకులు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పద్మ అనిల్ ముదిరాజ్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి బీజేవైఎం నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత అప్పగించిన బీజేపీ జాతీయ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తు,అదేవిదంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావుకి, BJYM జిల్లా అధ్యక్షులు నరేష్ కి మరియు పార్టీ సీనియర్ నాయకలకు, పెద్దలకు ఆయన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పార్టీ బలోపేతానికి మరియు ప్రజాసేవకు కట్టుబడి కృషి చేస్తానని అనిల్ తెలిపారు. యువమోర్చ జిల్లా కమిటీకి ఎన్నికైన తన తోటి మిత్రులకు హార్థిక శుభాకాంక్షలు. తెలియజేశారు
- చప్పిడి తిరుపతి: మేజర్ న్యూస్, తలకొండపల్లి.