BREAKING
హెచ్ ఆర్ ఏ జె మీడియా సెక్రటరీగా విమన్ కుమార్ నియామకం గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు

మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ మరింత అప్రమత్తంగా పనిచేయాలి

Select Suryaa Now
మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ మరింత అప్రమత్తంగా పనిచేయాలి

 

• ఆకతాయిలపై కఠిన చర్యలు.. 12 నుంచి 18 ఏళ్ల బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

• ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు: సీపీ అంబర్ కిషోర్ ఝా

సూర్య మంచిర్యాల టౌన్ : మహిళలు, బాలికలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో షీ టీమ్స్, మహిళలు, పిల్లల రక్షణ, భరోసా కేంద్రాల సేవలపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలకు భద్రతపై భరోసా కల్పించడంతో పాటు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించేలా షీ టీమ్స్ పనిచేయాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ మహిళలను వేధించే ఆకతాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.అందిన ఫిర్యాదులపై ఆధారాలు సేకరించి, నేరం జరిగినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ముఖ్యంగా 12 నుంచి 18 ఏళ్ల బాలికలకు వేధింపులు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, మంచి స్పర్శ–చెడు స్పర్శ తదితర అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు.బాధిత మహిళలు, చిన్నారులకు తక్షణ సహాయం అందించడంతో పాటు కౌన్సెలింగ్, వైద్య, న్యాయ, పునరావాస, సంక్షేమ సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీపీ పేర్కొన్నారు.బాధితుల పట్ల సానుభూతి,మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ వారికి ధైర్యం,భరోసా కల్పించాలన్నారు.

ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు.ఫిర్యాదులో నేరం ఉన్నట్లు తేలితే ముందుగా కేసు నమోదు చేసి అనంతరం దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. బాధితుల పట్ల అలసత్వం ప్రదర్శించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు నాణ్యమైన కౌన్సెలింగ్, రక్షణ, పునరావాస సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.షీ టీమ్స్ సిబ్బంది నిజాయితీ, పారదర్శకత, నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ బాధితుల గోప్యతను కాపాడాలని సీపీ సూచించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించేలా విస్తృత అవగాహన కల్పించాలని, వారి భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని అన్నారు.ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ అనిల్, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, షీ టీమ్ ఎస్‌ఐలు హైమా, ఉషారాణి, లావణ్య, షీ టీమ్ సిబ్బంది, భరోసా కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.