BREAKING
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి: సర్పంచ్, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దుర్గం చెరువు మల్లేశం ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుడిగే సతీష్ గౌడ్ జైలర్ 2 చిత్రంలో మోహన్‌లాల్ సీన్ల తొలగింపు.. రజినీకాంత్ సినిమా బృందంపై కాస్ట్యూమ్ డిజైనర్ తీవ్ర అసంతృప్తి ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడు కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్‌.. రిస్ట్రిక్టెడ్ చాట్‌తో మరింత భద్రత ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి ఏర్పాటు పరిశీలించిన ఎన్నికల అధికారి పేదింట పెళ్లి పందిరికి ప్రభుత్వ చేయూత!* చుక్కపేట ఆలయంలో సహస్ర కుంకుమార్చన పూజలు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన

భూసేకరణపై రేపు గ్రామసభలు.. రైతులు అభిప్రాయాలు తెలపాలి: తహసీల్దార్ పద్మావతి

Select Suryaa Now
భూసేకరణపై రేపు గ్రామసభలు.. రైతులు అభిప్రాయాలు తెలపాలి: తహసీల్దార్ పద్మావతి

బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టనున్న భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం శుక్రవారం గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ పద్మావతి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.బొంరాస్‌పేట్ గ్రామ రైతు వేదికలో శుక్రవారం ఉదయం 10 గంటలకు, నాందర్‌పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉదయం 11.30 గంటలకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాలువ నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులు ఈ గ్రామసభలకు హాజరై తమ అభిప్రాయాలు, సూచనలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని తహసీల్దార్ పద్మావతి సూచించారు.భూసేకరణకు సంబంధించిన అంశాలపై రైతులు తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామసభలు ఉపయోగపడతాయని తెలిపారు. కావున ఆయా రెవెన్యూ గ్రామాల పరిధిలోని కాలువ ప్రభావిత రైతులందరూ నిర్ణీత సమయానికి హాజరై గ్రామసభల్లో పాల్గొనాలని తహసీల్దార్ పద్మావతి విజ్ఞప్తి చేశారు.