BREAKING
48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్ మండపేట మున్సిపల్ ఎన్నికల్లో తొలిరోజు నామినేషన్లు నిల్ ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి: సర్పంచ్, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దుర్గం చెరువు మల్లేశం

Select Suryaa Now
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి: సర్పంచ్, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దుర్గం చెరువు మల్లేశం

బంట్వారం, మేజర్ న్యూస్ : రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని బంట్వారం సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దుర్గం చెరువు మల్లేశం డిమాండ్‌ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఆయన బీఆర్‌ఎస్‌ నాయకులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు సాగు చేసేందుకు అవసరమైన సమయంలో నాణ్యమైన విద్యుత్‌ సమస్య రావడంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, లోవోల్టేజీ సమస్యల వల్ల రైతులు బోర్ల ద్వారా పంటలకు నీరు అందించలేకపోతున్నారని లో వోల్టేజ్ సమస్యతో బోరు మోటర్లు కాలిపోతున్నాయని ఆయన తెలిపారు. ఎంతో కష్టపడి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో నీరు అందక ఎండిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో 24 గంటల కరెంటు అందించామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు . రైతులను ప్రభుత్వం ఆదుకొని పంటలు నష్టపోయిన రైతులందరికీ ఆర్థిక సాయం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజలకు సరిపడా తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. వేసవితో పాటు నీటి కొరత ఏర్పడే సమయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు రాకపోతే గ్రామాల్లో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు.

 

రిపోర్టర్: శ్రీనివాస్ గౌడ్, బంటారం, వికారాబాద్ జిల్లా.