BREAKING
మహంకాళి ఆలయ ఆర్చ్‌పై దాతల పేర్ల వివాదం..! * రూ.12 లక్షలతో ఆర్చ్ నిర్మిస్తే.. దాతగా మరో పోలీస్ అధికారి పేరు ! అసలైన దాతలకు అన్యాయం ! చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి!

భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రీ-సర్వే - కలెక్టర్ కుమార్ దీపక్

Select Suryaa Now
భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రీ-సర్వే - కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య, చెన్నూరు : జిల్లాలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం, భూముల హద్దుల నిర్ధారణ, భూ రికార్డుల్లో పారదర్శకతే లక్ష్యంగా ప్రభుత్వం రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం చెన్నూరు మండలం కోనంపేట గ్రామంలో నిర్వహించిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తొలి విడతలో జిల్లాలోని ప్రతి మండలం నుంచి రెండు గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
భూముల వాస్తవ విస్తీర్ణానికి, రికార్డుల్లో నమోదైన వివరాలకు మధ్య ఉన్న తేడాలు, భూ ఆక్రమణలు, హద్దుల వివాదాలు, గ్రామాల సరిహద్దుల సమస్యలను రీ-సర్వే ద్వారా గుర్తించి పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సాంకేతిక పరికరాల సహాయంతో క్షేత్రస్థాయిలో భూములను కొలిచి, హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలతో మ్యాపులు రూపొందిస్తామని తెలిపారు. సర్వే తేదీకి కనీసం వారం రోజుల ముందే భూయజమానులకు నోటీసులు అందజేస్తామని, వారు నిర్ణీత తేదీన తమ భూముల వద్ద అందుబాటులో ఉండి సర్వే సిబ్బందికి సహకరించాలని సూచించారు. నెన్నెల మండలంలోని రెండు గ్రామాలు, తాండూరు మండలం రాంపూర్‌లో నిర్వహించిన రీ-సర్వే ద్వారా సుమారు 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని కలెక్టర్ వివరించారు. వారసత్వ భూముల పంపకం, కుటుంబ సభ్యుల మధ్య వాటాల వివాదాలు వంటి సమస్యలు మినహా అనేక భూ వివాదాలకు పరిష్కారం లభించిందన్నారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం నిబంధనల ప్రకారం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం చెన్నూరు మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహ నిర్మాణ పనులు, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌తో కలిసి గోదావరి పుష్కర ఘాట్ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని సూచించారు. అమృత్‌ 2.0 పథకం పనులను త్వరగా పూర్తి చేసి ప్రతి ఇంటికీ నిరంతర తాగునీటి సరఫరా అందించాలని తెలిపారు. సోమనపల్లిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను కూడా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.