బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా పైడి రాజశేఖర్ రెడ్డి నియామకం
సూర్య- బిక్కనూర్ : బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు పైడి రాజశేఖర్ రెడ్డిని నియమించారు. జిల్లా బిజెపి అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆదేశాల మేరకు రాజశేఖర్ రెడ్డిని బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు, జిల్లా అధ్యక్షుడు నంది వేణు చెప్పాడు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా నూతన ఉపాధ్యక్షుడిగా నియమితులైన రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అడుగుజాడల్లో పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యేకు, జిల్లా బిజెపి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు