telanagana
బతుకమ్మ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి - ఎస్సై ఉదయ్ కిరణ్
సూర్య, జన్నారం : బతుకమ్మ వేడుకలను ప్రతిరోజు రాత్రి మహిళలు తమ తమ వాడలో ప్రశాంతంగా జరుపుకోవాలని జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు మహిళలు తమ తమ గ్రామాలలో రాత్రి వేళలో బతుకమ్మ బావుల వద్ద ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని అన్నారు. మహిళలు బతుకమ్మ ఆడుకున్న తర్వాత ఇళ్లల్లోకి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మెడలో ఉన్న నగలను జాగ్రత్తగా చూసుకోవాలని లేకుంటే దొంగలు అపహరించుకుని పోయే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. బతుకమ్మ ఆడుతున్న సమయంలో మగవాళ్లు ఎప్పటికప్పుడు ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని లేకుంటే వారిని మర్యాదగా పిలుచుకొని వారి పూర్తి వివరాలను తెలుసుకోవాలని, వారి మాటలను బట్టి అనుమానం వస్తే అదుపులో పెట్టుకొని తమకు సమాచారం ఇస్తే వెంటనే తమ సిబ్బంది ఆ ప్రాంతానికి రావడం జరుగుతుందని, ఎవరూ భయభ్రాంతులకు గురికావలసిన అవసరం లేదన్నారు. అదేవిధంగా బతుకమ్మ వేడుకలతో పాటు దసరా సందర్భంగా ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు తమ తమ ఇళ్లకు పగడ్బందీగా తాళాలు వేయడంతో పాటు చుట్టుపక్కల వారితో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.