బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన సర్పంచ్ స్రవంతి విజయభాస్కర్ రెడ్డి
సదాశివపేట ;సదాశివపేట మండలం నంది కంది చెరువు వద్ద బతుకమ్మ పండుగను పురస్కరించుకొని చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం గ్రామ సర్పంచ్ స్రవంతి విజయభాస్కర్ రెడ్డి పరిశీలించారు. పండుగకు వచ్చే మహిళలకు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు పరిసరాల్లో పరిశుభ్రత, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. బతుకమ్మ పండుగను మహిళలు, గ్రామ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివరాం,వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.