అశ్వారావుపేట మండలంలో రూ. 6.5 కోట్ల వ్యయంతో నూతన విద్యుత్ మౌలిక వసతులు
అశ్వారావుపేట మండలంలో రూ. 6.5 కోట్ల వ్యయంతో నూతన విద్యుత్ మౌలిక వసతులు
అశ్వారావుపేట మండల పరిధిలో రూ. 6.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ కావాడిగుండ్ల మరియు 33/11 కేవీ తిరుమలకుంట విద్యుత్ ఉపకేంద్రాలను టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. మోహన్ రావు ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన ఈ విద్యుత్ ఉపకేంద్రాలను టెక్నికల్‌గా ఛార్జ్ చేసి విద్యుత్ సరఫరాకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
అదేవిధంగా, అశ్వారావుపేట 220/132/33 కేవీ విద్యుత్ కేంద్రం నుంచి 33/11 కేవీ గంగారం విద్యుత్ ఉపకేంద్రం వరకు సుమారు 5.4 కి.మీ పొడవున నూతనంగా నిర్మించిన 33 కేవీ విద్యుత్ లైన్‌ను కూడా టెక్నికల్‌గా ఛార్జ్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ నూతన విద్యుత్ ఉపకేంద్రాలు మరియు 33 కేవీ లైన్ అందుబాటులోకి రావడంతో అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం సెక్షన్ పరిధిలోని గ్రామాలు, ముఖ్యంగా గిరిజన గ్రామాలకు, అలాగే రైతులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి, నాణ్యమైన, స్థిరమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ మౌలిక వసతులు ఎంతగానో దోహదపడనున్నాయి.
ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో గృహ అవసరాలతో పాటు వ్యవసాయ రంగానికి కూడా మెరుగైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రావడంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. నూతన ఉపకేంద్రాల ఏర్పాటుతో విద్యుత్ లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, భవిష్యత్తులో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కూడా వీలు కలుగుతుంది.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం సూపరింటెండింగ్ ఇంజనీర్జి. మహేందర్,డీఈ (కన్స్ట్రక్షన్) బి. వెంకటేశ్వర్లు,డీఈ (ఆపరేషన్) జె. భద్రు పవర్, ఏడీఈలు బి. వెంకటరత్నం,బి. రాంబాబు, మానస, ఏఈలుకే.వెంకటేశ్వర్లు,రామకృష్ణ, నరసింహారావు,మేఘన తదితరులతో పాటు ఓ & ఎం సిబ్బంది పాల్గొన్నారు.