telanagana
అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు
గ్రామంలో 330 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన సర్పంచ్ పట్లోళ్ల వరప్రసాద్ రెడ్డి
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్, (సెప్టెంబర్ 30):గ్రామంలో రేషన్ కార్డులు లేని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని బూరుగుపల్లి సర్పంచ్ పట్లోళ్ల వరప్రసాద్ రెడ్డి తెలిపారు. మోమిన్‌పేట్ మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో బుధవారం 330 మంది అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తానన్నారు. రేషన్ కార్డు లేని అర్హులను గుర్తించి వారికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అందించేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ అలవేలు, పంచాయతీ కార్యదర్శి సప్న, ఉపసర్పంచ్ ప్రభు, పంచాయతీ వార్డు సభ్యులు, రేషన్ డీలర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.