BREAKING
శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారుకి పట్టు చీర సమర్పించిన చాట్రాతి కుటుంబ సభ్యులు కేతగుడిపిలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 45 కుటుంబాలు!* బేతపూడి - రావి అనంతవరం బీటీ రహదారిని ప్రారంభించిన మంత్రులు దుద్దెడ శంభులింగేశ్వర క్షేత్ర కోనేరు పునర్నిర్మాణానికి సన్నాహాలు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్.చెక్కులు పంపిణీ ఖమ్మంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం నందివాడ మండలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవార్ల దర్శనం స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత గంధ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బి. ఎన్ సోషల్ మీడియా సమాచారపై జాగ్రత్తగా ఉండాలి:* ఎస్ఐ మహేష్ ఎల్‌నినో ప్రభావంపై.. రైతులకు అవగాహన కార్యక్రమం దశాబ్దాల నిరీక్షణకు తెర... 939 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు శ్రీ కంచి కామాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు యువత స్వయం కృషితో ఎదగాలి కొడంగల్‌లో ఆశా వర్కర్ల ధర్నా.. దోమ పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

అన్నోజిగూడలో భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. బంగారు పూస్తెలు సమర్పించిన ఆలయ కమిటీ చైర్మన్‌ గుగులోత్‌ గోవింద్‌ నాయక్‌

Select Suryaa Now
అన్నోజిగూడలో భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. బంగారు పూస్తెలు సమర్పించిన ఆలయ కమిటీ చైర్మన్‌ గుగులోత్‌ గోవింద్‌ నాయక్‌

ఘట్‌కేసర్‌ రూరల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11): ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పోచారం డివిజన్‌ పరిధిలోని అన్నోజిగూడ శ్రీ జగదంబ మాత, శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ దేవాలయంలో తొలిసారిగా నిర్వహిస్తున్న శ్రీ దుర్గామాత నవరాత్రి మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్‌ గుగులోత్‌ గోవింద్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, టీమ్‌ సేవాలాల్‌, బంజారా యువకుల సమష్టి సహకారంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ గుగులోత్‌ గోవింద్‌ నాయక్‌ కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బంగారు పూస్తెలను సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుగులోత్‌ గోవింద్‌ నాయక్‌ మాట్లాడుతూ.. అన్నోజిగూడలో తొలిసారిగా నిర్వహిస్తున్న శ్రీ దుర్గామాత నవరాత్రి మహోత్సవాలను అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ప్రతిరోజూ నిత్య అన్నదానం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యతను చాటుతాయని అన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, టీమ్‌ సేవాలాల్‌, బంజారా యువకులు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు నానవత్‌ రాంసింగ్‌ నాయక్‌, నానవత్‌ భిక్కు నాయక్‌, నానవత్‌ జితేందర్‌ నాయక్‌, డాక్టర్‌ దారావత్‌ కిరణ్‌కుమార్‌, నానవత్‌ రెడ్యానాయక్‌, గుగులోత్‌ తారాసింగ్‌ నాయక్‌, అంగోత్‌ లక్ష్మణ్‌ నాయక్‌, విశ్లావత్‌ జగన్‌ నాయక్‌, నానవత్‌ రమేష్‌ నాయక్‌, విశ్లావత్‌ రాంసింగ్‌ నాయక్‌, నానవత్‌ తారాసింగ్‌ నాయక్‌, విశ్లావత్‌ రవి నాయక్‌, నానవత్‌ సంతోష్‌ నాయక్‌, నానవత్‌ సీతారాం నాయక్‌, గ్రామ పెద్దలు, మాజీ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు సామల సందీప్‌ రెడ్డి, ఆలయ కమిటీ వైస్‌ చైర్మన్‌ నానవత్‌ విజయ్‌ సింగ్‌, అధ్యక్షుడు అంగోత్‌ సంతోష్‌, ప్రధాన కార్యదర్శి నానవత్‌ రాకేష్‌, కోశాధికారి విశ్లావత్‌ వినోద్‌ నాయక్‌, దేవుసింగ్‌, నానవత్‌ రాజు, అంగోత్‌ వినోద్‌, వి. ప్రశాంత్‌, వేణు, వికాస తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: లంబ రాజు, ఘట్కేసర్ రూరల్, మేడ్చల్ జిల్లా.