BREAKING
రాచవారిపాలెం వద్ద విషాద ఘటన.. గొర్రెలు కాస్తున్న 8 ఏళ్ల బాలుడి దీనస్థితి కనపడుటలేదు..... కళ్ళు తిరిగి కూలబడిన కాంగ్రెస్ అగ్ర నేత అధిక ఉష్ణోగ్రతతో ఆందోళన కార్యక్రమంలో కనుమూరు బాపిరాజుకు అస్వస్థత వీఆర్ఏల దీక్షకు సంపూర్ణ మద్దతు విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు క్విజ్ పోటీలు పాఠశాల సమస్యలపై ఎస్ఎఫ్ఐ పరిశీలన 60 లక్షల వ్యయం తో ముస్లిం కమ్యూనిటీ భవనం నిర్మాణానికి భూమి పూజ మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి శ్రీకల్యాణ వెంకటేశ్వరునికి గజ, సింహ వాహనాల విరాళం కోటపాటి జనార్దన్‌రావు వదిన మృతి మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ షాక్ విద్యుత్ కోతలపై బిజెపి నిరసన అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం పౌర హక్కులపై అవగాహన అవసరం పదవీ విరమణ పొందిన ఏఎస్ఐకి సన్మానం

అక్షర యాత్రలో అద్భుతాలు సృష్టిద్దాం.....

Select Suryaa Now
అక్షర యాత్రలో అద్భుతాలు సృష్టిద్దాం.....

 

 *ఎం.ఎస్ రియల్టర్ అండ్ డెవలపర్స్ అధినేత మహమ్మద్ షకీల్ రూ. 5 లక్షలు విరాళం* 

*దాతలూ.. మీకు శతకోటి వందనాలు..* 

*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* 

రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొని ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకోవడం ద్వారా నిరుపేద పిల్లలకు ఇక్కడ పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నాం.. మీకోసం అక్షరాలను అంకితం చేస్తున్నాం.. సమాజానికి ఆభరణాలుగా ముస్తాబు కండి.. మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడండి.. అంటూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. షాద్ నగర్ పట్టణంలోని సిండికేట్ కాలనీలో నిరుపేద పిల్లల కోసం దాతల సహకారంతో బడి భవన నిర్మాణానికి బుధవారం షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ భూమి పూజ చేశారు.

 ఈ సందర్భంగా కాలనీవాసులు నాయకులు తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. పాఠశాల కోసం తన సంకల్పానికి అండగా నిలిచిన దాతలు, జర్నలిస్టులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద పిల్లలు, సమాజం మీద అవగాహన లేని కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో వారికి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రయత్నంలో ఎంఈఓ మనోహర్ సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యకు దూరంగా ఉన్న విద్యార్థులను సర్వే చేసి వారి వివరాలను అందించడం ద్వారా ముందడుగు వేసినట్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులకు ఈరోజు ఒక అవకాశం వచ్చింది.. ప్రభుత్వమే వారి ముందుకు వచ్చి నిలబడింది.. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువు ఒక్కటే సమాజంలో మార్పులు తీసుకొస్తుందని, అంబేద్కర్,అబ్దుల్ కలాం లాంటి విద్యావేత్తలను కీర్తిస్తాం తప్ప ఆదాని, అంబానీలను కీర్తించమని గుర్తు చేశారు. తాను కూడా ఒక పేద కుటుంబం నుంచే వచ్చి చదువుకొని ఎమ్మెల్యేను అయ్యానని, చదువుకున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తు అవకాశాలను కల్పిస్తుందని స్పష్టం చేశారు. అందుకే అందరం పనికట్టుకుని స్వచ్ఛందంగా మీ జీవితాల్లో వెలుగు నింపేందుకు ముందుకు వచ్చామని విద్యార్థుల తల్లిదండ్రులతో అన్నారు. విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్తే బాధ్యత తమదేనా అని వెల్లడించారు. విద్యార్థులకు భవనం మాత్రమే కాదు.. వారికి కావలసిన పుస్తకాలు, డ్రెస్సులు, బ్యాగులు ప్రతి ఒక్కటి అందజేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ పాఠశాల కోసం దాదాపు 50 మంది దాతలు 5000 తో మొదలుపెట్టి 5 లక్షలు కూడా ఇచ్చిన వారు ఉన్నారని వెల్లడించారు. జీవితంలో పిల్లలకు సేవ చేసే బాధ్యత తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జన్మనిచ్చిన ప్రతి తల్లికి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్తయిందని, నందిగామ, ఫరూక్ నగర్, మొగిలిగిద్ద పాఠశాలలను కూడా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈరోజుకు పాఠశాలల్లో హాస్టల్లో సమస్యలు ఉన్నాయంటే నాయకుల సిగ్గుపడాలని ఉద్వేగంగా పలికారు. అన్ని సమస్యలపై దృష్టి పెట్టి విజ్ఞాన కాంతులను అందించే దిశగా పోటీ తత్వంతో ముందుకు వెళ్లడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

 *దయ చూపిన దాతలు..* 

పాఠశాల నిర్వహణకు సంబంధించి తమ వంతు సహకారం అందించేందుకు దాతలు ముందుకు వచ్చారు. ఎం.ఎస్ రియాల్టర్ అండ్ డెవలపర్స్ అధినేత షకీల్ రూ. 5 లక్షలు విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా ప్రముఖ వ్యాపారి వైఎన్ఆర్ గెలాక్సీ వ్యాపార సంస్థకు చెందిన యెడ్ల నరేందర్ విద్యార్థులకు అవసరమైన బ్యాగులు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇక మరో దాత మందుల రమేష్ రూ. 50,000 విరాళంగా ప్రకటించగా ఎమ్మార్పీఎస్ నేత పెంటన్నోళ్ల నరసింహ రూ. 11,000 ప్రకటించారు. జర్నలిస్ట్ ఆంజనేయులు 11,000, జేఏసి నాయకుడు జనార్ధన్ 5000 విరాళంగా ప్రకటించారు. వెలుజర్ల సర్పంచ్ బాబు నాయక్ పాఠశాల సంబంధించిన కంకర, డస్ట్ ను విరాళంగా అందజేయనున్నారు. మున్సిపల్ చైర్మన్ అగునూరు బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ ,గిరిజన ఆదివాసి కోఆర్డినేటర్ రఘు, మార్కెట్ డైరెక్టర్ కరుణాకర్, హాజిపల్లి సర్పంచ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో ప్రసంగించారు. 

 *భవిష్యత్తు నిర్మాణ సారథులు మీరే.. ఎంఈఓ మనోహర్* 

సిండికేట్ కాలనీలో నిర్మించబోతున్న ప్రభుత్వ బడికి స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి సహకరించడం, బడి లేని పిల్లలు ఎంత అదృష్టవంతులు అంటే వారి పాఠశాలను వారే నిర్మించుకొని వారి తలరాతను వారే మార్చుకున్న ఘనత చిరస్థాయిగా నిలిచిపోతుందని అంతటి అదృష్టవంతులు విద్యార్థులు అంటూ ఫరూక్ నగర్ మండల విద్యాశాఖ అధికారి మనోహర్ సభలో వ్యాఖ్యానించారు. దాతలకు తదితర ప్రజాప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ ముదిరాజ్, మండల విద్యాధికారి మనోహర్, కౌన్సిలర్ కొప్పు నూరి ప్రవీణ్, హాజపల్లి గ్రామ సర్పంచ్ కుమార్ ఉప సర్పంచ్ గంగాధర్, కౌన్సిలర్ పెంటయ్య, రాజు నాయక్ దిలీప్, బచ్చలి నరేష్, ముబారక్ అలీ ఖాన్, సాదిక్ ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ హాజుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనూష, గిరిజన ఆదివాసి రాష్ట్ర కో ఆర్డినేటర్,రఘు నాయక్, ఇబ్రహీం, శ్రీశైలం గౌడ్, మధువలు యాదవ్, సుదర్శన్ ,బాబు నాయక్, శ్రీను నాయక్, రవీందర్ రెడ్డి,విజయ్ కుమార్ రెడ్డి, జాం గారి రవి, ప్రశాంత్ పెంటనోళ్ళ నరసింహ, సయ్యద్ సాదిక్ భాయ్, రవితేజ మహేందర్, ఇసాక్, ప్రముఖ వ్యాపార వేత్తలు షకీల్, జహాoగిర్, టి జేఏసీ నేతలు జనార్దన్, సిద్ధార్థ, కరుణాకర్, రాము గోర్ల, అర్జున్,నరేష్ వెంకటేష్, జంగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జవ్వాజి రాఘవేందర్ గౌడ్, మేజర్ న్యూస్ షాద్ నగర్.